Maharashtra: ప్రేమ, పెళ్లి.. నచ్చని కుటుంబసభ్యులు నవదంపతులను హత్య..
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలకు నచ్చకపోయినా పెళ్లి చేసుకున్నారు. సరే అయిందేదో అయిపోయింది, రాజీకొద్దాము రమ్మన్నారు ఇద్దరి తల్లిదండ్రులు. అంతలోనే వారి లోని క్రూరత్వం నిద్ర లేచింది. అమ్మాయి తల్లిదండ్రులు కనీస కనికరం లేకుండా నిర్ధాక్షణ్యంగా నవదంపతులిద్దరినీ చంపి బావిలో పడేసింది.;
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఒక మహిళను, ఆమె ప్రేమికుడిని బంధించి చంపి బావిలో పడేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జంట హత్య కేసులో ప్రమేయం ఉన్నందున మృతురాలి తండ్రితో సహా ఆమె కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
ఉమ్రి తహసీల్‌లోని కర్కల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆమెకు అప్పటికే వేరొకరితో వివాహం జరిగింది. అయినా ఆమె తన ప్రేమికుడితో సంబంధాన్ని కొనసాగిస్తోంది. అది చూసిన ఆమె మామ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశాడు.
ఆ మహిళ తండ్రి, తాత, మామ వారిద్దరినీ తమతో రమ్మని బలవంతం చేశారు. దాంతో వారంతా గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో వారిద్దరినీ చంపి సమీపంలోని బావిలో పడేశారు
అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) అర్చన పాటిల్ మాట్లాడుతూ.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసాము, కేసును మరింత దర్యాప్తు చేస్తున్నాము" అని అన్నారు.