నారాయణపేట జిల్లా మక్తల్ ... దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇళ్లల్లో చోరీలు, వైన్ షాపుల్లో దొంగతనాలు, బైక్ లు ఎత్తుకెళ్లడాలు, బస్టాండ్లలో దోచుకోవడాలు.... ఇలా రకరకాల చోరీలకు.. మక్తల్ కేంద్రంగా మారుతోంది. నిందితులు తమను గుర్తుపట్టకుండా ముసుగులు వేసుకుని, గోడలకు కన్నాలు తవ్వి... సీసీకెమెరాల కన్నుగప్పి చోరీలకు పాల్పడుతున్నారు. చివరకు సీసీటీవీ దృశ్యాలు నమోదయ్యే డీవీఆర్ లను కూడా ఎత్తుకెళ్తున్నారు. వరుస దొంగతనాలతో మక్తలు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు.