Nalgonda: ఎస్‌ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. నమ్మించి మోసం చేశాడంటూ..
Nalgonda: తెలంగాణ ఖాకీలపై వరుసగా లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. పోలీసులకు మాయని మచ్చను తెస్తున్నాయి.;
Nalgonda: తెలంగాణ ఖాకీలపై వరుసగా లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. పోలీసులకు మాయని మచ్చను తెస్తున్నాయి. హైదరాబాద్‌లోని మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై వేధింపుల ఆరోపణలు మరువకముందే.. ఇప్పుడు మరో ఎస్‌ఐపై కేసు నమోదయ్యింది. మల్కాజ్‌గిరి సీసీఎస్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌పై ఓ మహిళ కేసు పెట్టింది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సహజీవనం చేశాడని.. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఎస్‌ఐ విజయ్‌పై మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. విజయ్‌కు ముందే పెళ్లి జరిగినట్లు ఆలస్యంగా తెలిసిందని.. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. నమ్మించి మోసం చేసిన విజయ్‌పై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బాధితురాలు.