బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కట్టుబడి పాలెంకి చెందిన చిన్న మస్తానయ్య ఆల్టం క్రెడో ఫైనాన్సులో తన ఇంటిని తనకా పెట్టి 7 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఫైనాన్స్ సిబ్బంది మాయ మాటలు చెప్పి లోన్ శాంక్షన్ చేయించి వడ్డీ ఎంత కట్టాలో కూడా ఇంటి యజమానికి చెప్పకుండా గోపియంగా ఉంచి లోన్ ఇప్పించారు. మస్తానయ్య ఆర్థిక పరిస్థితి బాగా లేక కొన్ని నెలలు లోన్ నగదు కట్టకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది మస్తానయ్యపై పలుమార్లు దుర్భాషలాడి ఒత్తిళ్లకు గురి చేశారు. అప్పటికి మస్తానయ్యకు నగదు సమకూరకపోవడంతో లోను కట్టలేదు. దీంతో బ్యాంకు వాళ్లు ఇంటిని జప్తు చేసుకొని ఇంటి గోడపై ఇల్లు ఫైనాన్స్ లో ఉన్నది ఫైనాన్స్ కట్టనందున ఇంటిని అమ్ముతాము అని బోర్డు పెట్టగా మస్తానయ్య మనస్థాపానికి గురి అయ్యి మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇలాంటి ఫైనాన్స్ సంస్థల దాటికి మరిన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో తెలియదు అని కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు. మా కుటుంబానికి దిక్కెవరు అంటూ ఆర్తనాదాలు వ్యక్తపరుస్తున్నారు. మృతికి కారణాలు తమ కుటుంబ సభ్యులను అడగగా ఫైనాన్స్ వారి ఒత్తిళ్లకు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తపరిచారు. తనకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నాడని వారిని ఎలా పోషించోకోవాలో అర్థం కావడం లేదని కన్నీరు పర్వతం చెందారు.