రాష్ట్రంలో గంజాయి మాఫియా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పోలీసులు, ఉన్నతా ధికారులు, ప్రభుత్వ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అమ్మకం దారులు తమ రూటును మార్చి విక్రయాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ ఎస్‌వోటీ, పేబ్బషీ రాబాద్ పోలీసులు ఆదివారం సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించి సుబాష్ నగర్లోని కోమల్ కిరాణా షాప్ లో 5 ప్యాకెట్లతో 200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కిరాణా షాప్ యజమాని పివేష్ పాండును అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు గత ఆరు నెలలుగా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు, యువతీయువకులు, హార్డ్ వర్క్ చేసుకునే కూలీల లక్ష్యంగా ఈ చాక్లెట్లు మార్కెట్ లోకి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.