Married Woman Suicide : కట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

Update: 2025-07-21 05:45 GMT

అదనపు కట్నం అతివల ప్రాణాలు తీస్తుంది. అదనపు కట్నంతో ఇప్పటికే ఎంతో మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే దుండిగల్‌లో చోటుచేసుకుంది. వరకట్నం కోసం అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. మల్లంపేటకు చెందిన సాయిరామ్‌కు పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన అశ్వినితో ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. పెళ్లి సమయంలో రూ.11 లక్షల నగదు, 18 తులాల బంగారం ఇచ్చారు. రెండేళ్ల క్రితం ఆమె చెల్లి పెళ్లికి తల్లిదండ్రులు అశ్విని మామ దగ్గర భూమి తాకట్టు పెట్టి రూ.3లక్షల అప్పు తీసుకున్నారు.

ఈ క్రమంలో కట్నం కింద ఇవ్వాల్సిన రూ.లక్షతో పాటు అప్పు చెల్లించాలంటూ అశ్వినిపై భర్త, అత్తమామ ఒత్తిడి చేశారు. ఇదే విషయంలో శనివారం భర్త ఆమెను కొట్టాడు. దీంతో మనస్థాపం చెందిన అశ్విని తన కూతురు కళ్లెదుటే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News