TG : వివాహితను చంపి ఇంటి ముందే పూడ్చిన భర్త, అత్త, మామ.. పరార్

Update: 2025-01-17 11:00 GMT

తెలంగాణలోని మహబూబాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. భర్త, అత్త, మామ, ఆడపడుచు ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. గొయ్యిలో పాతిపెట్టిన తర్వాత ఇంటికి తాళం వేసి భర్త, అత్త, మామ, ఆడపడుచు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గొయ్యి పూడ్చిన చోట తవ్వగా మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న భర్త, అత్త, మామ, ఆడపడుచు కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News