నిడదవోలు పట్టణంలో భారీ చోరీ జరిగింది. చోరీకి సంబంధించి వివరాలను రాజమహేంద్రవరం ఎడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారాజు మీడియాకు వెల్లడించారు. నిడదవోలు పట్టణం బుక్కా పేటలో నివాసం ఉంటున్న వీరేంద్ర గౌతమి కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణంగా మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చికిత్స కొరకు వెళ్లారు. అయితే గత నెల 30వ తేదీ బుధవారం తాళాలు పగల కొట్టి కింద పడి ఉండడం గమనించి ఇంటి యజమానులక, పోలీసులకు ఎదురింటి వారు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం తో వివరాలు సేకరిస్తున్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో చోరీ జరిగిందని గత రాత్రి ఇంటికి వచ్చి చూసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామన్నారు. పాత నేరస్తుల కదలికలు చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలించి సాధ్యమైనంత త్వరలో దుండగులను అరెస్టు చేసి, సొమ్ము రికవరీ చేస్తామని తెలిపారు.