Chandanagar: బాలికకు యువకుడి వేధింపులు.. అత్యాచారం చేశాడంటూ తల్లిదండ్రుల ఆరోపణ..
Chandanagar: హైదరాబాద్ చందానగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.;
Chandanagar: హైదరాబాద్ చందానగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. అరవింద్ అనే యువకుడు.. పదోతరగతి బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. ఆమెపై అత్యాచారం కూడా చేశాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తూ.. పోలీసులను ఆశ్రయించారు. అయితే అత్యాచారం ఏదీ జరగలేదంటూ.. పోలీసులు బాలిక తండ్రినే చితకబాదారని.. బాధితులు మండిపడుతున్నారు.
అధికార పార్టీ కార్పొరేటర్ కాంప్రమైజ్ కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దళిత బాలికపై అత్యాచారం చేస్తే.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదని.. పోక్సో కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారంటున్నారు.