నీలిచిత్రాలు చేయాలంటూ ఒత్తిడి.. వర్ధమాన నటి అరెస్ట్..!
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం వార్తల్లో కొనసాగుతుండగానే.. మరో పోర్న్ రాకెట్ వెలుగులోకి వచ్చింది.;
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం వార్తల్లో కొనసాగుతుండగానే.. మరో పోర్న్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. పచ్చిమబెంగాల్‌లో చాలా రహస్యంగా అశ్లీల చిత్రాలను నడిపిస్తున్న మోడల్ కం నటి నందితా దత్తాని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు. నందితా దత్తా సినిమాల్లో అవకాశాల కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తుంది.
అయితే అవకాశాలు అంతగా రాకపోవడంతో బీ గ్రేడ్, చివరికి సెమీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ వస్తోంది. యంగ్ మోడల్స్‌కు తనకున్న పరిచయాలతో వెబ్‌సిరీస్ లలో అవకాశాలు ఇప్పిస్తానని వారికి మాయమాటలు చెప్పి.. చివరికి వాళ్లు వలలో చిక్కాక.. నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఇలా చిక్కుకున్న ఇద్దరు బాధితులు పోలీసులకి పక్కా సమాచారం ఇచ్చారు.
దీనితో కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో పోలీసులు దాడులు జరిపి నందితా దత్తాతో పాటుగా ఆమె అనుచరుడు మైనక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇది భారీ సెక్స్ రాకెట్ అనే అనుమానం ఉందని, రాజ్‌కుంద్రాతో లింక్‌లు ఏమైనా ఉన్నాయేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.