TG : సికింద్రాబాద్ ర్యాలీలో ఈటల.. నిందితుడికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై ఓవైపు బంద్ కొనసాగుతుండగా… మరోవైపు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయం నుంచి హనుమాన్ చాలీసా పారాయణంతో ర్యాలీని నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ హిందూ సంఘాల కార్యకర్తలు బాటా, మోండా మార్కెట్ మీదుగా ముత్యాలమ్మ ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఈటల విగ్రహ ధ్వంసం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపే అవకాశముందని హెచ్చరించారు.