Madhya Pradesh: పైకి పాల వ్యాపారం...లోపల చేసేదేమో వ్యభిచారం..!
Madhya Pradesh : మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం రాత్రి జడేరియా సమీపంలోని గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలో సెక్స్ రాకెట్‌ను పక్కా సమాచారంతో పట్టుకున్నారు..;
ప్రతీకాత్మక చిత్రం
Madhya Pradesh : మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం రాత్రి జడేరియా సమీపంలోని గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలో సెక్స్ రాకెట్‌ను పక్కా సమాచారంతో పట్టుకున్నారు.. ముగ్గురు మహిళలు, 10 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రీతమ్ మనోహర్ అనే వ్యక్తి ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకి సమాచారం అందింది. దీనితో మురార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శైలేంద్ర భార్గవ, మహిళా పోలీసు బృందంతో కలిసి ఇంటిపై దాడి చేశారు. ముందుగా పోలీసుల బృందంలోని ఒకరు కస్టమర్‌గా లోపలికి వెళ్లారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని తెలియడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత ప్రీతమ్ మహూర్‌ను పోలీసులు విచారించగా అతను తన భార్య ద్వారా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లుగా వెల్లడించాడు.. పాల దుకాణం ముసుగులో ఈ దందా సాగుతోందని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఉన్న నగదు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.