MURDER: పట్టపగలే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
మరో ఘటనలో రెండేళ్ల కూతుర్ని చంపిన కసాయి తల్లి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిని కొందరు గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో శ్రీకాంత్ రెడ్డి ఇంటి బయటే నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కుషాయిగూడ పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే కాలనీ వాసులంతా చూస్తుండగానే శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కొందరు అడ్డుపడగా వారిని కత్తులతో బెదిరింపులకు గురిచేశారు.
రెండేళ్ల కూతుర్ని చంపిన కసాయి తల్లి
మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలంలోని శభాష్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని కసాయి తల్లి, ప్రియుడు హత్య చేశారు. మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్ తో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ పెట్టుకుని ఇద్దరు పిలల్లతో కలిసి పుట్టింటికి వచ్చిన మమత.. అదే గ్రామానికి చెందిన ఫయాజ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారీ తను శ్రీని తల్లి మమత, ప్రియుడు ఫయాజ్ హత్య చేశారు. కసాయి తల్లి మమతతో పాటు ప్రియుడు ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.