అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో ముగ్గురు యువతుల్ని చిత్రహింసలకు గురిచేసి ఓ డ్రగ్స్ గ్యాంగ్ అత్యంత దారుణంగా హతమార్చింది. మోరెనా వెర్డి (20), బ్రెండా డెల్ కాస్టిల్లో (20), లారా గుటియెర్రెజ్ (15) అనే ముగ్గురు యువతులు సెప్టెంబర్ 19న మిస్సయ్యారు. యువతుల్ని పార్టీ పేరుతో మభ్యపెట్టి.. తమతో తీసుకెళ్లిన గ్యాంగ్.. దారుణంగా చంపేసింది. డ్రగ్స్ గ్యాంగ్ తో వారికున్న గొడవలే హత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన గ్యాంగ్ లో ఒకరు తన ఇన్ స్టా ప్రైవేట్ అకౌంట్లో లైవ్ టెలీకాస్ట్ చేసినట్లు చెప్పడంతో.. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. గోళ్లను పీకి.. వేళ్లను నరికి, తీవ్రంగా కొట్టి.. ఊపిరాడకుండా చేసి చంపినట్లు లైవ్ చూసిన 45 మంది పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఈ పాశవిక చర్యకు నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత యువతుల కుటుంబ సభ్యులతో పార్లమెంట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి.. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.