ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' షోరూమ్ కు దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘటనలో పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. రంగంలోకి దిగిన అగ్ని మాపక దళం మంటలను అదుపు చేసింది. అయితే ఒక కారుపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈఘటన అమెరికా లోని లాస్వెగాస్లో చోటుచేసుకుంది. టెస్లా షోరూమ్లో అగ్నిప్రమాద ఘటనపై అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ... 'ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్య' అని పేర్కొన్నారు.ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిప్పు పెట్టిన ఘటనపై అసలు కారణాలేమిటనే అంశంపై ఆరా తీస్తున్నారు. అలాగే మస్క్ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.