భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్ సేవలు అనతి కాలంలో ప్రజాదరణను పొందాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ క్యూఆర్ కోడ్ యూపీఐ ఐడీ సిస్టమ్ ఆన్లైన్ చెల్లింపులను చేసే అవకాశం ఉండ డం వల్ల ఎక్కువ మంది ఈ చెల్లింపును ఇష్టపడుతున్నారు.
అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్నట్లే యూపీఐ సేవల్లోని లొసుగులను ఉపయోగించుకుని కొంతమంది అకౌంట్స్ లోని డబ్బు తస్కరిస్తున్నారు. ముఖ్యంగా స్కామర్లు ఆటో పే రిక్వెస్ట్ ద్వారా యూపీఐ యూజర్ల నుంచి సొమ్మును కాజేస్తున్నారు. ఈ రిక్వెస్ట్‌లను ఏమరుపాటుగా ఆమోదిస్తే మీ ఖాతాలోని సొమ్ము మాయం అవుతుంది. యూపీఐ కలెక్ట్ మనీ స్కామ్ ఒక సాధారణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. గతంలో యూపీఐ రిక్వెస్ట్ ద్వారా సొమ్ము కాజేసే కేటుగాళ్లు ఇప్పుడు పేటీఎం, నెట్ ఫ్లెక్స్ సబ్ స్క్రిప్షన్ పేరుతో దోచేస్తున్నారు. ముఖ్యంగా రిక్వెస్ట్ పేటీఎం, నెట్ ప్లెక్స్ వంటి సంస్థలే నోటిఫికేషన్ పంపాయనుకునేలా ఆటో పే రిక్వెస్టులు పంపుతున్నారు. అయితే ఏది నిజమైన రిక్వెస్ట్, ఏది మోసపూరిత రిక్వెస్ట్ అనేది తెలియక వినియోగదారులు మోసానికి గురవుతున్నారు.
పొరపాటున మీరు ఈ అభ్యర్థనను మీ సొంత నెట్ ప్లెక్స్ సబ్ స్క్రిప్షన్ అని భావించి ఆమోదిస్తే మీ ఖాతా నుంచి సొమ్ము ఖాళీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు యూపీఐ ఐడీలను మెరుగ్గా వినియోగించు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యూపీఐ ఐడీలు ఎక్కడా డిస్ప్లే కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.