TG : మనిషి కాదు మానవ మృగం...ఇద్దరు భార్యలు భర్త నీ చంపిన కేసులో సంచలనం విషయాలు
ఇటీవల ఇద్దరు భార్యలు కలిసి తమ భర్త ను హత్య చేసిన సంగతి తెలిసిందే. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం పిట్టలోని గూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఇద్దరు భార్యలను అరెస్ట్ చేయగా విచారణ లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
పిట్టలోని గూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్, గౌరమ్మ ఇద్దరు భార్యలు. వీళ్లిద్దరూ సొంత అక్కాచెల్లెల్లు కాగా వీరి తల్లి జున్నుబాయిని మే 18న కనకయ్య మామిడి తోటలో దారుణంగా హత్య చేశాడు. తాగిన మైకంలో అత్తపై దాడి చేసి హతమార్చాడు. తమ తల్లిని హత్య చేశాడనే కోపంతో ఇద్దరు భార్యలు బెయిల్ పై వచ్చిన కనకయ్యను మంగళవారం గొడ్డలితో నరికి చంపేశారు.
అయితే ఆ ఇద్దరు భార్యలకు గ్రామస్థులు కూడా సాయం చేయడం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా కనకయ్యను చంపడంతో అతడి తల్లి, అక్కా చెల్లెల్లతో పాటు గ్రామస్థులంతా సంబురాలు జరుపుకుంటున్నారు. కనకయ్య మనిషి కాదని వావి వరసలు లేని మానవ మృగం అని కనకయ్య తోడబుట్టిన సోదరి సంచలన విషయాలు బయట పెట్టారు. తల్లి , చెల్లి, చిన్నమ్మ ఇలా ఇంట్లో ఆడవాళ్ళ అందరి మీద అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.
కనకయ్య మరణం తో గ్రామానికి పట్టిన శని వదిలిందని గ్రామస్తులు అన్నారు. ఇద్దరు భార్యలు కనకయ్యను చంపుతున్నప్పుడు అక్కడే ఉన్నామని అలాంటి వాడు చస్తేనే మంచిదని సంతోషపడ్డామని అన్నారు. దయచేసి అతడిని చంపిన వాళ్లకు శిక్ష వేయవద్దని వాడి పీడపోయిందని వ్యాఖ్యానించారు. మరోవైపు గ్రామస్థులు సైతం కనకయ్య చాలా దుర్మార్గుడని వావివరసలు లేని నరరూప రాక్షసుడిని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏ మహిళ కనిపించినా అత్యాచారం చేసేవాడని చెప్పారు.