వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్‌రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.ఇప్పటికే డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్ట్ అయిన ప్రభాకర్ రెడ్డి.. బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయితే, తమను పెళ్లి చేసుకుంటామని చెప్పి ప్రభాకర్ రెడ్డి మోసం చేశాడని ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రభాకర్ రెడ్డిపై 417, 420, 354A కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరు యువతులపై అత్యాచారం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.