పహల్‌గామ్ ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివిధ దేశాల నాయకులు Xలో పోస్టులు పెట్టారు. దాడిలో నష్టపోయిన వారి ఆలోచనలు నా మదిలో మెదులుతున్నాయని UK ప్రధాన మంత్రి తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జర్మన్ ఛాన్స్‌లర్ అన్నారు. ఈ సమయంలో యూరప్ మీతో ఉంటుందని EUకమిషన్ ఛైర్మన్ Xలో తెలిపారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ‘చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాని మోదీకి, భారతీయులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు మా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.