ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు..!
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రూరల్ పీఎస్‌లోని ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌పై వేటు పడింది. ఓ కేసు విషయంలో గొడవపడ్డ పోలీసులు.. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు.;
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రూరల్ పీఎస్‌లోని ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌పై వేటు పడింది. ఓ కేసు విషయంలో గొడవపడ్డ పోలీసులు.. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. రూరల్ పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న తిరుమలరావు, హెడ్‌కానిస్టేబుల్ జనార్థన్‌ల మధ్య ఒక కేసుకు సంబంధించి పెన్‌డ్రైవ్ నుంచి ప్రింట్‌లు తీసే విషయంలో వివాదం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టుకోవడంతోపాటు .. ఇద్దరూ కొట్లాటకు దిగడంతో సహచర సిబ్బందిని ఇద్దరినీ విడిపించారు. వీరు పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నారు. స్టేషన్‌లో ఏఎస్‌ఐ, హెచ్‌సీలు కొట్లాడుకున్న విషయాన్ని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరినీ వీఆర్‌కు రావాలని ఆదేశించారు. ఇద్దరి మధ్య కొట్లాట విషయంపై పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిసింది.