Secunderabad Kidnap : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్.. రెండు గంటల్లో చేధించిన పోలీసులు..
Secunderabad Kidnap : హైదరాబాద్ లో ఏడాది వయస్సు చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది;
Secunderabad Kidnap : హైదరాబాద్ లో ఏడాది వయస్సు చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే రైల్వే పోలీసులు వేగంగా స్పందించడంతో చివరికి సుఖాంతమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన ఏడాది వయస్సు ఉన్న చిన్నారి కిడ్నాప్ కేసును రెండు గంటల్లో చేధించారు పోలీసుల.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీసీఫుటేజ్ ఆధారంగా బాబును కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించి కవాడిగూడ పోలీసులకు సమాచారం అందించారు.ఆటోలో వెళుతున్న మహిళ కవాడిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నుంచి వచ్చిన ఒంటరి మహిళ దగ్గర చిన్నారిని చూసిన మరో మహిళ అమెతో మాటలు కలసి బాబును మచ్చిక చేసుకుంది. చిన్నారి తల్లి వాష్‌రూంకి వెళ్లగానే చిన్నారితో సహా పారిపోయింది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి కవాడిగూడ వైపు వెళుతున్నట్లుగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.. కాపుకాసిన కవాడిగూడ పోలీసులు ఆటోలో వెళుతున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు.