TG : పొలిటికల్ టర్న్ తీసుకున్న చిలుకూరు బాలాజీ అర్చకుడి దాడి

Update: 2025-02-10 11:45 GMT

చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దారి రాజకీయ రంగు పులుముకుంది. ఇవాళ ఉదయం మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు పరామర్శకు వెళ్లారు. రంగరాజన్ పై దాడిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు భారీ సంఖ్యలో చిలుకూరుకు చేరుకొని రంగరాజన్ ను పరామర్శించారు. ఈ వివాదం బీజేపీ భిన్న స్వరాలు వినిపించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ అడుగు ముందుకేసి రంగరాజన్ సూఫీలతో ఉన్న ఫొటోలను విడుదల చేశారు. ' ఒక దేవాలయానికి రాజుగా ఉండి మరో మతస్థలానికి వెళ్లి పొగడడం ఎక్కడి న్యాయం?. గతంలో కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో ఒక మజీద్ ఇష్యూ వస్తే సమర్థించడం ఎక్కడి న్యాయం. మాకు అభ్యంతరం లేదు మజీద్ కట్టండి అనే విధంగా ఈ మహారాజు గారు ఎలా మాట్లాడుతారు. అక్కడ హిందూ సంఘాలు అభ్యంతరం చెప్పడంతో ఈ మహారాజు వెనక్కి తగ్గారు. మజీద్ నిర్మాణంపై తన స్టేట్మెంట్ ను వాపస్ తీసుకున్నారు. 'అంటూ మరో వివాదా న్ని తెరపైకి తెచ్చారు. అదే సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ రంగరాజన్ పై దాడిని ఖండించారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నానని ట్టిట్టర్ వేదికగా తెలిపారు. రంగరాజన్ తొందరగా కోలుకోవాలని కోరుకుం టున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి సహాయ, సహ కారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు భిన్న స్వరాలు వినిపించడం విశేషం.

Tags:    

Similar News