Narayana College : నారాయణ కాలేజీ యాజమాన్యం వేధింపులు.. పెట్రోల్‌తో నిప్పంటించుకున్న విద్యార్ధి
Narayana College : హైదరాబాద్ అంబర్‌పేట్ నారాయణ కాలేజీలో దారుణం జరిగింది.;
Narayana College : హైదరాబాద్ అంబర్‌పేట్ నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. ఓ విద్యార్ధి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఏకంగా ప్రిన్సిపల్ రూమ్‌లోనే విద్యార్ధి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిప్పంటించుకున్న విద్యార్ధి.. వెంటనే ప్రిన్సిపల్ చేతిని పట్టుకున్నాడు. కాలిపోతున్న తోటి విద్యార్ధిని కాపాడేందుకు మరో ఇద్దరు ప్రయత్నించారు. దీంతో నిప్పంటించుకున్న విద్యార్ధికి, ఇటు ప్రిన్సిపల్‌కు, మరో ఇద్దరు స్టూడెంట్స్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.
కాలేజీ యాజమాన్యం వెంటనే 108కు సమాచారం అందించింది. గాయపడిన విద్యార్ధులు, ప్రిన్సిపల్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు, టీసీ విషయంలో వేధించడంతోనే.. నిప్పంటించుకున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.