Actress Ranya Rao : భర్త ఫిర్యాదుతోనే దొరికిపోయిన రన్యా రావ్!

Update: 2025-03-11 11:45 GMT

బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ రన్యారావ్ కేసులో మరో ట్విస్ట్. నిజానికి ఆమెపై DRI అధికారులకు ఫిర్యాదు చేసింది భర్తేనని తెలిసింది. ఆయన కుటుంబీకులతో ఆమెకు విభేదాలు ఉన్నట్టు సమాచారం. పెళ్లైన రెండు నెలల నుంచే ఆమె విదేశాల్లో పర్యటించడంతో గొడవలు మొదలైనట్టు వార్తలొస్తున్నాయి. మొదట ఆమె రష్యాకు ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లేది. భర్త సమాచారంతోనే నిఘా పెట్టిన DRI చివరకు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

కాగా.. నటి రన్యారావుకు కోర్టు విధించిన మూడ్రోజుల డీఆర్ఐ కస్టడీ సోమవారంతో పూర్తయ్యింది. దీంతో, అధికారులు ఆమెను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా.. కోర్టు ఆమెకు రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మార్చి 24 వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కన్నడ నటి రన్యారావు పట్టుబడింది.

Tags:    

Similar News