Krishna District : ప్రియుడిని చెట్టుకు కట్టేసి అతని ముందే యువతిపై అత్యాచారం
Krishna District : కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పల్లిపాలెంలో దారుణం జరిగింది.;
Krishna District : కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పల్లిపాలెంలో దారుణం జరిగింది. ఫిషింగ్ హార్బర్ చూసేందుకు సరదాగా బీచ్‌కు వెళ్లిన ఓ ప్రేమ జంటపై...మందుబాబులు దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిపై అత్యాచారం చేశారు. ఆమె ప్రియుడిని స్తంభానికి కట్టేసి అతని ముందే ఘాతుకానికి పాల్పడ్డారు. ఐతే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.యువతి పరిస్థితి గమనించి ఆమె సోదరుడు నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు బందరు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లైంగిక దాడి చేసిన ఇద్దరిలో ఒకరిని గుర్తించామని...మరోకరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.