రాజమండ్రి సమీపంలో గతరాత్రి నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 13 మందితోపాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో కొందరు ఫెర్టిలైజర్స్ షాపుల యజమానులు మద్యం, అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారంతో అందడంతో దాడి చేసి భగ్నం చేశారు. మూడు కార్లు స్వాధీనం చేసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే స్థానిక పోలీసులను మేనేజ్ చేసుకుని రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి జిల్లాలో ఇటీవల వరుసగా రేవ్ పార్టీలు వెలుగులోకి వస్తున్నాయి. సంక్రాంతి పండుగ సమీపించడంతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.