TG : 12 మంది చిన్నారుల రెస్క్యూ.. నిందితురాలు ఓ ఆశా వర్కర్ అని తేల్చిన పోలీసులు

Update: 2025-03-20 07:00 GMT

హైదరాబాద్ లో పసిపిల్లలను విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. బుధవారం చాలా చాకచక్యంగా వ్యవహరించి 12 మంది పిల్లలను కాపాడారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులను దత్తత తీసుకుంటున్నట్లు అందరినీ నమ్మంచి మహా రాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తు తేలింది. ఇప్పటివరకు ఇదే ముఠా ఆయా రాష్ట్రాల్లో దాదాపు 18 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న అమూల్యను కూడా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా పాల్పడే ఎవరినీ వదిలిపెట్టబోమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. పిల్లల విక్రయాల కేసులో మొత్తం ఇప్పటి వరకు 27 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. కాపాడిన చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. ముఠాలో కీలక నిందితురాలైన అమూల్య ఆశా వర్కర్ గా పనిచేస్తోందని గుర్తించారు. మధురా నగర్ లోని శిశు విహార్ కు పిల్లలను తరలించారు. ఇందులో చైతన్యపురి పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడు గురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులే.

Tags:    

Similar News