జనగామ జిల్లాలో దారుణ హత్య
జనగామ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భూవివాదంలో రిటైర్డ్ MPDO రామకృష్ణయ్యను సుపారీ గ్యాంగ్ అతికిరాతకంగా చంపేసారు.
జనగామ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భూవివాదంలో రిటైర్డ్ MPDO రామకృష్ణయ్యను సుపారీ గ్యాంగ్ అతికిరాతకంగా చంపేసారు. మూడ్రోజుల కిందట రామకృష్ణయ్యను దండుగులు కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత చంపక్‌హిల్స్ సమీపంలో హత్య చేసి కుంటలో పడేశారు. రామకృష్ణయ్య మృతదేహం కుంటలో దొరకడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు రామకృష్ణయ్య మృతదేహంగా గుర్తించారు. రామకృష్ణయ్యను హత్య చేసి కుంటలో పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు రామకృష్ణయ్య మర్డర్ మిస్టరీగా మారింది. ఈ హత్య వెనుక రాజకీయ దుమారం రేపుతోంది.
రిటర్డ్ MPDO రామకృష్ణయ్య హత్య కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని పోలీసులు స్పష్టంచేశారు.