Medchal accident : మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి..!

Medchal accident : మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.

Update: 2021-09-11 15:30 GMT

Medchal accident : మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. మేడ్చల్ జిల్లా జాతీయ రహదారిపై అత్వెలి గ్రామ సమీపంలో కారు.. బైక్‌.. టాటా ఏస్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... అందులో ఉన్న మరికొందరు ప్రయాణీకులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Tags:    

Similar News