ఆర్టీసీ బస్సు డ్రైవర్ అత్యాశకు పోయాడు. పోలీస్ కేసులో చిక్కుకున్నాడు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లో నుండి బంగారం కొట్టేస్తూ దొరికిపోయాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న మహిళ.. తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. ఆ బ్యాగ్‌పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను దొంగిలించాలని ప్రయత్నించాడు. సంచి నుంచి బస్సు డ్రైవర్ బంగారం తీస్తుండగా.. బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్‌లో వీడియో రికార్ట్ చేశాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు