Hyderabad : ఓఆర్ఆర్‌పై తప్పిన పెను ప్రమాదం..
Hyderabad : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు తగలబడింది. గచ్చిబౌలీ నుండి పెద్ద అంబర్ పేట్ వెళుతుండగా రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కోండ వద్ద ప్రమాదం జరిగింది.;
Hyderabad : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు తగలబడింది. గచ్చిబౌలీ నుండి పెద్ద అంబర్ పేట్ వెళుతుండగా రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కోండ వద్ద ప్రమాదం జరిగింది.
రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించి అప్రమత్తమైన డ్రైవర్ కారులో నుంచి దూకేశాడు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. హుటాహుటిన ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అయితే అప్పటికే మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది.