West Godavari: యువతిపై సర్పంచ్ కుమారుడు అత్యాచారయత్నం.. ఆపై హత్య..
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది.;
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. కాళ్లమండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన యువతి... తండ్రి మృతిచెందడంతో అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఆ యువతిపై కన్నేసిన గ్రామ సర్పంచ్ తనయుడు సాయి ప్రసాద్... ఆమె నిద్రిస్తున్న గదిలోకి చొరబడి అత్యాచారానికి యత్నించాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో హత్యచేసి పరారయ్యాడు. గ్రామపెద్దలు రాజీ చేసి యువతి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. దహన సంస్కారాలను అడ్డుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.