Medchal Accident : మేడ్చల్ హైవేపై మరో ఘోర రోడ్డు ప్రమాదం..
Medchal Accident : మేడ్చల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద పడి యువతి దుర్మరణం చెందింది;
Medchal Accident : మేడ్చల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద పడి యువతి దుర్మరణం చెందింది. ఉదయం ఆరు గంటల సమయంలో డ్యూటీ కోసం స్కూటీపై బయల్దేరిన ప్రియను.. రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కనీసం ముందు వెనక చూడకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. అప్పటికే లారీ డ్రైవర్ సైతం బ్రేక్ వేస్తూ, ప్రమాదాన్ని తప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కాని, స్కూటీని లారీ ఢీకొట్టడంతో.. లారీ చక్రాల కింద నలిగి ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ జరిగిన తరువాత ఆపకుండా వెళ్లిపోయిన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.