High Court Lawyer : భార్య బ్రతికివుండగానే రెండో పెళ్లి

Update: 2024-02-21 06:39 GMT

భార్య బ్రతికివుండగానే చనిపోయిందని చెప్పి రెండవ వివాహం చేసుకున్న ఓ హైకోర్ట్ లాయర్ కీచకపర్వం బట్టబయలు అయ్యింది. భాదితురాలు తెలిపిన కథనం ప్రకారం.. నాగోల్ డివిజన్ జైపూర్ కాలనీకి చెందిన అమరేందర్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేటకు చెందిన పల్లవితో వివాహం జరిగింది. వారికి అన్జిత (06), రాయ్ (05) ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

దీంతో వారసుడి కోసం అమరేందర్ గత ఆరు సంవత్సరాల నుంచి పల్లవికి 4 సార్లు అబార్షన్ చేయించాడు. దీంతో ఆమె గర్భసంచి బలహీన పడిందని డాక్టర్లు చెప్పడంతో కొడుకు కోసం వేధింపులకు గురిచేసేవాడని పల్లవి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పల్లవిని దూరంగా వుంచి భార్య మరణించిందని కొన్ని రోజుల క్రితం మరోపెళ్లి చేసుకున్నట్లు భాదితురాలు ఆరోపిస్తూ.. అమరేందర్ ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండు చేశారు.

ఫిర్యాదు అందుకున్న సరూర్ నగర్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక్కడ అమరేందర్ తండ్రి కూడా జడ్జి అని తెలపడం గమనార్హం. వారు లాయర్, జడ్జిలమని అమాయకులను మోసం చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాజంలో ఇలాంటి వారు ఉండడం వల్ల ఆడ పిల్లల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని, ఈ చదువుకున్న మూర్ఖులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News