దేవరకొండలో యువకుడు సెల్ఫీ సూసైడ్
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం చింతబావి గ్రామంలో దారుణం జరిగింది. చెట్టుకు ఉరేసుకొని శంకర్ అనే యువకుడు ఆత్మహత్య;
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం చింతబావి గ్రామంలో దారుణం జరిగింది. చెట్టుకు ఉరేసుకొని శంకర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన ఆత్మహత్యకు అత్త, మామ, బావమరిదే కారణం అంటూ వీడియోలో తెలిపాడు. అలాగే తన బిడ్డను కాపాడాలని కోరాడు. గత మూడు నెలల క్రితం శంకర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలోని ఇద్దరు యువకుల వేధింపులతోనే శంకర్ భార్య ఆత్మహత్య చేసుకుందని.. ఆ అంశంలో ఓ మండల ప్రజాప్రతినిధి సెటిల్‌మెంట్ చేసి డబ్బులు ఇప్పించారు. అయితే డబ్బుల విషయంలో అత్తమామల టార్చర్ భరించలేకనే శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.