Meerpet Murder Sensations : భార్యను నరికి తలకాయ కాల్చగా..భార్యను చంపిన ఘటనలో సంచలనాలు

Update: 2025-01-23 12:00 GMT

హైదరాబాద్ మీర్‌పేట్‌లో వెంకట మాధవి (35) అనే మహిళ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై అనుమానంతో భర్త గురుమూర్తే చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 18 నుంచి మాధవి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

నరరూప రాక్షసుడు గురుమూర్తి భార్యను చంపిన ఘటనలో మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. భార్యను ముక్కలు చేసిన అతడు తలకాయను కాల్చగా చుట్టుపక్కల వాళ్లకు వాసన వచ్చినట్లు తెలిసింది. అయితే సంక్రాంతి పండగ కావడంతో మేక తలకాయ కావొచ్చని అనుకున్నారట. ఇక భార్య శరీరాన్ని ముక్కలు చేయడాన్ని అతడు వీడియో తీసినట్లు సమాచారం. బాడీని మాయం చేసేందుకు గురుమూర్తి పలుమార్లు ‘దృశ్యం’ సినిమా చూసినట్లు తేలింది.

Tags:    

Similar News