America : అమెరికాలో కాల్పులు.. భారత్‌కు చెందిన తండ్రి, కూతురు మృతి

Update: 2025-03-24 09:00 GMT

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన ప్రదీప్(56), ఆయన కుమార్తె ఊర్మి(26) మృతిచెందారు. వీరు వర్జీనియాలో డిపార్ట్‌మెంటల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. నిందితుడు ఉదయాన్నే ఆ షాపు వద్దకు వచ్చి గొడవకు దిగారు. రాత్రి నుంచి మద్యం కోసం వేచి ఉంటే షాపు ఎందుకు మూసేశారని గన్‌తో కాల్పులకు దిగాడు. ప్రదీప్ అక్కడికక్కడే చనిపోగా, ఊర్మి ఆస్పత్రిలో మరణించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బంధువు పరేశ్ పటేల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సోదరుడి భార్య, ఆమె తండ్రి షాపులో పనులు చేసుకుంటుండగా ఒకరు వచ్చి కాల్పులు జరిపాడు.. ఏం జరిగిందో నాకు తెలియదు.. ’ అని అన్నారు. హతుడు ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు.

Tags:    

Similar News