Sri Krishna Devi Prasad Swamiji: ఆశ్రమంలో ఉరివేసుకొని స్వామీజీ ఆత్మహత్య..
Sri Krishna Devi Prasad Swamiji: 51 ఏళ్ల శ్రీకృష్ణ దేవీ ప్రసాద్ స్వామీజీ అయిదేళ్ల క్రితం భార్యతో విడిపోయారు.;
Sri Krishna Devi Prasad Swamiji: మంగళూరులోని ధర్మచావడి మఠానికి చెందిన శ్రీకృష్ణ దేవీ ప్రసాద్ స్వామిజీ ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. జులై 22న తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
51 ఏళ్ల శ్రీకృష్ణ దేవీ ప్రసాద్ స్వామీజీ అయిదేళ్ల క్రితం భార్యతో విడిపోయారు. ఆయనకు 23 ఏళ్ల కూతురు కూడా ఉంది. జీవితంపై విసుగు చెందినందుకే స్వామీజీ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని మఠంలో ఉండేవారు చెప్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.