ఆన్ లైన్ లోన్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయని, లోన్ ఇచ్చేప్పుడు తియ్యటి మాటలతో పలకరించే నిర్వాహకులు వసూలు సమయంలో మాత్రం తమ అసలు రంగు బయటపెడుతున్నారన్నారు.
లోన్ యాప్ల వారి ఆగ డాలను భరించలేక ఎందరో అమాయకులు బలవుతున్నారని పోలీసులు ప్రత్యేక సందేశం జారీ చేశారు. ఆన్లైన్లోని రుణ యాప్ లలో అప్పు తీసుకుని అవసరాలు తీర్చుకోవడం తాత్కాలికంగా మనల్ని సమస్య నుంచి బయటపడేలా చేస్తాయని, ఆ తర్వాత ఆ ఒక్క క్లిక్ వారిపాలిట శాపంగా పరిణమిస్తుందని హెచ్చరించారు.
లోన్ యాప్లతో తీసుకున్న అప్పులు జీవితాన్ని అంధకారంలో నెడతాయని, వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ట్విట్టర్ వేదికగా అప్రమత్తం చేశారు.