Terrorist Rana : తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

Update: 2025-04-11 12:15 GMT

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు తహవూర్ రాణా తమ పౌరుడు కాదంటూ పాక్ పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గడచిన రెండు దశాబ్దాల్లో రాణా తన పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు. అతడు కెనడా జాతీయుడనేది సుస్పష్టం’ అని పేర్కొంది. మరోవైపు.. ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ISI పాత్ర ఉందన్న విషయం రాణాపై విచారణ అనంతరం బయటికొస్తుందని NIA వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాపై ప్రస్తుత ప్రధాని మోదీ 2011, జూన్ 10న చేసిన ట్వీట్ తాజాగా వైరలవుతోంది. ‘ముంబై దాడిలో తహవూర్ రాణా నిర్దోషి అని అమెరికా ప్రకటించి భారత సార్వభౌమత్వాన్ని అవమానించింది. ఇది విదేశాంగ విధానానికి తిరోగమనం’ అని ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు 14ఏళ్ల తర్వాత రాణాను అమెరికా నుంచి రప్పించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News