Anantapur: అనంతపురం జిల్లాలో కీచక టీచర్.. విద్యార్థినులపై లైంగిక వేధింపులు..
Anantapur: అనంతపురం జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.;
Anantapur: అనంతపురం జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. గుత్తి కోట వీధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సాలెవేముల బాబు అనే ఉపాధ్యాయుడిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కొందరు విద్యార్థినులు డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు సాలెవేముల బాబుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కీచకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గతంలోనూ సాలెవేముల బాబుపై లైంగిక ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది.