గద్వాల జిల్లాలో విషాదం..ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది;

Update: 2023-06-05 12:15 GMT

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. ఈ ఘటన పల్లెపాడు పరిధిలో చోటుచేసుకుంది. వివాహ వేడుక కోసం మానవపాడు మండలం బోరువెల్లికి వచ్చారు ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన బంధువులు. అయితే వీరు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో ఐదుగురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారి క్షేమంగా బయటపడింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు చెప్పారు.


Tags:    

Similar News