హైదరాబాద్ లో (Hyderabad) రోడ్డు ప్రమాదం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను బలితీసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బైక్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఘటన హైదరాబాద్‌లో ఐటీ సెక్టార్ లో చోటుచేసుకుంది.
గచ్చిబౌలిలోని (Gachchibowli) ఓ కంపెనీలో సాఫ్ట్ ఇంజినీర్‌గా ఆకుల సాయికృష్ణ (Akula Saikrishna) పనిచేస్తున్నాడు. అతడి వయస్సు 26 ఏళ్లు. బైక్‌పై డీఎల్ఎఫ్ వైపు వెళ్తుండగా కంట్రోల్ తప్పాడు. బైక్ అదుపు తప్పి స్లిప్ కావడంతో.. ఆర్టీసీ బస్సు వెనక టైర్ల కిందపడ్డాడు.
దారుణ ఘటనలో సాయికృష్ణ క్షణాలలో స్పాట్ లోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. ట్రాఫిక్ చూసుకుంటూ తొందరపడకుండా వెళ్లాలని వాహనదారులకు సూచించారు.