పట్టుబడ్డ సైకో కిల్లర్
హైదరాబాద్ శివారు మైలార్‌దేవ్‌పల్లిలో డబుల్ మర్డర్ కేసులో సైకో కిల్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు.;
హైదరాబాద్ శివారు మైలార్‌దేవ్‌పల్లిలో డబుల్ మర్డర్ కేసులో సైకో కిల్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. తాగిన మైకంలో సైకో ప్రవీణ్ రోడ్డు పక్కన పడుకున్నవారిని టార్గెట్ చేస్తూ వరుసగా హతమార్చుతున్నట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆదారంగా నిందితుడిని పట్టుకున్నారు. హత్యలు జరిగిన 12 గంటల్లోనే హంతకుడిని ట్రాప్ చేశారు. బండరాయితో మోది చంపేసిన తర్వాత అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోవడం సైకో ప్రవీణ్ స్టైల్.
2011లోనే ప్రవీణ్‌పై ట్రిపుల్ మర్డర్ కేసు నమోదైంది. చోరీ కేసులూ ఉన్నాయి. ప్రతి కేసులోనూ జైలు శిక్ష అనుభవించిన ప్రవీణ్ బుద్ధి మార్చుకోలేదు. నేతాజీ నగర్, దుర్గానగర్ చౌరస్తా, కాటేదాన్‌లో జరిగిన మూడు హత్యలు తానే చేశానని ఒప్పుకున్న ప్రవీణ్ హత్య చేసి వారి వద్ద 4 వందల రూపాయలు చోరీ చేశాడు. మొత్తం ఇప్పటి వరకు 8 మందిని హత్య చేసినట్లు గుర్తించారు. మద్యం సేవించేందుకు చేతబడి చేస్తారన్న భయంతో హత్యలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వరుస హత్యలపై సైకో ప్రవీణ్ రకరకాల కారణాలు చెబుతున్నారంటున్న రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి.