Hyderabad : గన్‌ఫైరింగ్ చేసి స్టేటస్‌లో పెట్టిన టీఆర్ఎస్ నాయకులు..
Hyderabad : హైదరాబాద్ రాచకొండ పరిధిలో గన్ ఫైరింగ్ కలకలం రేపింది. మీర్‌ఖాన్ పేట్ టీఆర్ఎస్ నాయకులు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు.;
Hyderabad : హైదరాబాద్ రాచకొండ పరిధిలో గన్ ఫైరింగ్ కలకలం రేపింది. మీర్‌ఖాన్ పేట్ టీఆర్ఎస్ నాయకులు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వారిలో టీఆర్ఎస్‌వీ మండల ప్రెసిడెంట్ విగ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ ఉన్నారు. ఫైరింగ్ దృశ్యాలు స్టేటస్ పెట్టుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిర్ గన్, ఒరిజినల్ గన్ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. రవీందర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్‌గా చెప్తున్నారు. బర్త్ డే వేడుకలకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన బడా నాయకులు హాజరైనట్లు సమాచారం.