TTD Vigilance Case Filed : టీటీడీ దొంగ టికెట్లు.. కానిస్టేబుల్‌పై కేసు నమోదు

Update: 2024-12-21 13:15 GMT

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను అక్రమంగా భక్తులకు అమ్మిన కానిస్టేబుల్ పై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు. సుమారు 70 వేల విలువైన 300 రూపాయల టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అరకు ఎమ్మెల్యే సిఫార్సుపై నాలుగు టికెట్లకు గాను 20 వేలు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సిఫార్సుపై ఆరు టికెట్లకు 50 వేల రూపాయలను వసూలు చేసిన కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన భక్తులకు టికెట్లు అమ్మాడని నిర్దారించారు. విజిలెన్స్ అధికారులను ఆశ్రయించిన భక్తులతో విషయం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News