Prasad Behera Arrest : హీరోయిన్‌కు వేధింపులు.. టీవీ ఆర్టిస్ట్ ప్రసాద్ బెహరా అరెస్ట్

Update: 2024-12-19 12:30 GMT

యూట్యూబ్లో మావిడాకులు, పెళ్లివారమండి లాంటి వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఓ నటిని వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. కమిటీ కుర్రాళ్లు లాంటి సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహరా అరెస్ట్ కావడం.. వెంటనే 14 రోజులు రిమాండ్కి కూడా వెళ్లడం చక చకా జరిగాయి. ప్రసాద్ బెహరా నటించిన వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటి ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడని అప్పుడు ఆమెకు నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ చేయనని చెప్పి వెళ్లిపోయినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత ఎన్నోసార్లు క్షమాపణ చెప్పడంతో ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని మెకానిక్ అనే వెబ్ సిరీస్ లో ప్రసాద్ మళ్లీ కలిసి నటించడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అయితే అప్పటికి కూడా అతని బుద్ది మారలేదని, ఆమెను టచ్ చేయడం షూట్ లొకేషన్లోనే అందరి ముందు తనపై పడే ప్రయత్నం చేశాడని పేర్కొంది. అతని భాష సరిగా లేదని, ఆ భాష కారణంగా ఆమె ప్రసాద్ అంటే భయపడిపోయినట్లు వెల్లడించింది. ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అందరి ముందు తన బ్యాక్ ను అసభ్యకరంగా తాగాడని, ఎందుకు కొట్టావు అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని, సెట్లో ఉన్న అందరూ అది జోక్ అనుకుని నవ్వేశారని తెలిపింది. షూట్ చేస్తున్న సమయంలోనే ఎన్నోసార్లు తన బ్యాక్ గురించి అసభ్యంగా మాట్లాడాడని ఆమె తెలిపింది. అంతేకాక తన ముఖం మీద వస్తున్న వెంట్రుకల గురించి కూడా అస్యభ్యంగా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు చేస్తానంటే దానికి కూడా అసభ్యకరంగా మాట్లాడాడని, కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 14వ తేదీన ఫిర్యాదు అందడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. 

Tags:    

Similar News