Medchal: మేడ్చల్‌లో విషాదం.. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్య..
Medchal: మేడ్చల్ జిల్లా కీసరలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు.;
Medchal: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. రాంపల్లిదాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డిలు అన్నదమ్ములు. వారి తల్లి ప్రమీల 9 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిన యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డిలు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. అన్న యాదిరెడ్డి ఉరివేసుకోగా.. తమ్ముడు మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.