Nandyala : సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి..
Nandyala : నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలోని రాంకో సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది;
Nandyala : నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలోని రాంకో సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. సిమెంట్ ఫ్యాక్టరీలో కన్వేయర్ బెల్ట్ తెగి ఇద్దరు కార్మికులు చనిపోయారు. వంద అడుగుల ఎత్తులో కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే డెడ్‌బాడీలను బనగానపల్లె ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ నెల 28న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభం కావాల్సి ఉంది.
సిమెంట్ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్...సీఎం ప్రొగ్రామ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చనిపోయిన కార్మికులు బెంగాల్‌కు చెందిన రహీం, సుమన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిుకులు డిమాండ్ చేస్తున్నారు.