Vizag : వైజాగ్ బీచ్‌లో మాయం.. నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షం
vizag : వైజాగ్ ఆర్కే బీచ్‌లో వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.;
Vizag : వైజాగ్ ఆర్కే బీచ్‌లో వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ముమ్మరంగా గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. సాయి ప్రియ సముద్రంలో గల్లంతైందని అందరూ హైరానా పడుతుండగా...నెల్లూరులో ఉందని తేలటంతో అందరూ అవాక్కయ్యారు. అసలు భర్తకు చెప్పాపెట్టకుండా సాయిప్రియ నెల్లూరు ఎందుకు వెళ్లిందనేది మిస్టరీగా మారింది.
వైజాగ్ ఆర్కే బీచ్‌లో వివాహిత మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. బీచ్‌లో కనిపించకుండా పోయిన సాయిప్రియ కోసం గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు తేల్చిన బంధువులు..ప్రేమిడికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు.
శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు..సాయిప్రియ నెల్లూరుకి చెందిన రవితో లవర్ ఎఫైర్ ఉన్నట్లు తెలిసింది.ఫ్యామిలీ ఒత్తిడి మేరకు రెండేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ను సాయిప్రియ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
సాయిప్రియ భర్త శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో ఉంటోంది. పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారం కొనసాగించినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ కోర్సు అంటూ సాయిప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది.
ఈనెల 25న పెళ్లి రోజు కావడంతో హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన శ్రీనివాస్...ఇద్దరూ ఆర్కే బీచ్‌కి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో శ్రీనివాస్‌కు ఫోన్ రావడంతో మాట్లాడి వచ్చేలోపు సాయిప్రియ కనిపించ లేదు. సముద్రంలో గల్లంతైనట్టు భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సముద్రంలో గల్లంతై ఉండొచ్చని అనుమానంతో స్పీడ్‌బోట్లు, హెలిక్టాప్టర్ ద్వారా నేవీ అధికారులు గాలించారు. సాయిప్రియ జాడ దొరకకపోవడంతో అసలు సముద్రంలోనే గల్లంతైందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో ఆమె నెల్లూరు ఉందని తేలడంతో అందరూ అవాక్కయ్యారు.
సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు భారీగా ఖర్చు చేశారు. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించారు. మిస్సింగ్ విషయం ఎంతో మంది అధికారులను పరుగులు పెట్టించడమే కాక, ఫ్యామిలీని కూడా ఆందోళనకు గురిచేసింది. మరో ట్విస్టు ఇస్తూ ప్రియుడు రవిని సాయిప్రియ పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది.